జోరుగా సాగుతున్న ‘వైయస్సార్‌ కుటుంబం’

రైల్వేకోడూరు :రైల్వేకోడూరులో వైయస్సార్‌ కుటుంబంలో సభ్యత్వ కార్యక్రమం జోరుగా సాగుతోంది. పట్టణంలోని ధర్మాపురం ఏరియాలో బుధవారం పార్టీ నాయకులు ప్రతి గడపకు వెళ్లి వైయస్సార్‌ను గుర్తు చేశారు. వారి నుంచి కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేసి వైయస్సార్‌ కటుంబంలో సభ్యత్వం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తమకు డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ రావడం లేదన్నారు. కార్యక్రమంలో ఆ ఏరియా బూత్‌ కన్వీనర్‌ పుష్పలత, పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌ రమేష్‌ బాబు, ఉప కన్వీనర్‌ రౌఫ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఈ మహేష్, పార్టీ నాయకులు రాజా, శివ, శంకర, చైతన్య, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top