ప్రతి ఒక్కరికీ తోడుగా వైయస్ ఆర్ కుటుంబం

పరిగి: అధికారంలోకి రాగానే మళ్లీ రాజన్న రాజ్యం తిరిగి  వస్తుందని మండల వైయస్ ఆర్ సీపీ నాయకులు భరోసా  ఇచ్చారు.  పెద్దిరెడ్డిపల్లిలో గురువారం పలువురు గ్రామస్తులు వైయస్ఆర్  కుటుంబంలోకి చేరారు. మండల కన్వీనర్‌ జయరామ్, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శులు డీవీ రమణ, ప్రభు, బీఆర్‌ నారాయణ, నరేష్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో గ్రామంలో కార్యక్రమం కొనసాగింది.  ప్రతి ఇంటికీ వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకోసం ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చారో  వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలతో సుభిక్షం చేస్తే మహానేత మరణాంతరం ప్రస్తుత టీడీపీ హయాంలో దుర్బిక్ష పరిస్థితులు నెలకొనడంతో పాటు అభివృద్ది ఆమడ దూరానికి వెళ్లిపోయిందని ప్రజలు వాపోయారు.  ఈసందర్భంగా పలువురు 9121091210 సెల్‌నెంబరుకు మిస్డ్‌ కాల్‌ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొన్నారు. కార్యక్రమంలో మూర్తి, బాలు, నంజుండప్ప, నరసింహారెడ్డి, ఆంజినేయులు, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లత్తవరం గ్రామంలో : ఉరవకొండ రూరల్‌ మండల పరిదిలోని లత్తవరం, గ్రామంలో గురువారం బూతు కమిటిల కన్వీనర్‌ల ఆద్వర్యంలో వైఎస్‌ఆర్‌ కుటుంభం ను కలుసుకునే కార్యక్రమం నిర్వహించారు..బూతు కమీటీ మెంబర్లు కలిసిన ప్రతి ఇంటికి వైఎస్‌ఆర్‌ స్టిక్కరులను అతికించడం జరిగింది.ఈకార్యక్రమంలో బూతుకమిటి కన్వీనర్‌ ఓబులపతి,వెంకటేసులు,హనుమంతు,రామాంజినేయులు తోపాటు వైఎస్‌ఆర్‌ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top