ఊరూరా వైయ‌స్ఆర్ కుటుంబం

వెలుగోడు: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో వైయ‌స్ఆర్  కుటుంబం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. శనివారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటా పర్యటించారు. వైయ‌స్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు పథకాలను ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు మోసాలను ఎండగడుతూ, కుటుంబ సభ్యుల వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో చేర్పిస్తున్నారు.  పార్టీ మండల నాయకుడు బోగోలు శివశంకర్‌ నాయుడు మాట్లాడుతూ..నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగం వైయ‌స్‌ జగన్‌ తీసుకొస్తారన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్‌, ప్రతాప్‌రెడ్డి, నరసింహుడు, నూరుబాషా, జనార్ధన్‌ , నడిపి బాలనాయుడు, రామకష్ణ, బాలన్న, బాలస్వామి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top