ముమ్మరంగా వైయ‌స్ఆర్‌ కుటుంబం

రైల్వేకోడూరు: రైల్వేకోడూరు గ్రామ పంచాయితీ అరుంధతీవాడలో జడ్‌పీటీసీ మారెళ్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో ముమ్మరంగా వైయ‌స్ఆర్  కుటుంబం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వ‌రి మాట్లాడుతూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెల్లి వైయ‌స్ఆర్‌ కుటుంబంతో పలు కుటుంబాలను చేర్పించినట్లు ఆమె తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఫోన్‌ చేస్తున్నారని అన్నారు. మంచిరోజులు రావాలంటే ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీని  ఆదరించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌ రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మండల నాగేంద్ర, జిల్లా బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి మహేష్, ఎంపీటీసీ కోడూరు సుబ్రమణ్యం, ప్రసాద్, నాగేశ్వరరావు, సుబ్రమణ్యం, అశోక్, పాలయ్య, ధనుంజయ, నాగార్జున, వెంకటరమణ, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top