వైయ‌స్ఆర్‌కు జననేత శ్రద్ధాంజలి విశాఖ పట్నం : దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్‌ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ ఈ మేరకు మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్ వైయ‌స్ఆర్‌’ అంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం జననేత 252వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. 
Back to Top