రాజన్న రాజ్యం.. జగనన్నతోనే సాధ్యం

తూర్పుగోదావరి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజల కష్టాలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని గొల్లపోలు పార్టీ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గొల్లపోలు నియోజకవర్గ బూత్‌ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం.. వైయస్‌ జగన్‌ అన్నతోనే సాధ్యమన్నారు. మూడున్నరేళ్ల కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలో బూత్‌ కమిటీ నేతలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీపై పోరాటం చేయాలన్నారు. అదే విధంగా వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top