వచ్చేది రాజన్న రాజ్యమే

గుంటూరు: సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత రాజన్న రాజ్యం.. వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. గుంటూరు జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే ఆధ్వర్యంలో నవరత్నాల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో వందల సంఖ్యలో మోసపూరిత హామీలిచ్చి అమాయక ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు మర్చి.. పబ్లిసిటీ పిచ్చితో టీడీపీ పాలన సాగిస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నవరత్నాలతో చేకూరే లబ్ధిని బూత్‌ కమిటీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top