మ‌హానేత‌కు కుటుంబ స‌భ్యుల నివాళి


వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఆదివారం ఉద‌యం మ‌హానేత స‌మాధి వ‌ద్ద వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కూతురు ష‌ర్మిల‌మ్మ‌, వైయ‌స్ భార‌త‌మ్మ‌, తదితరులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, మ‌హానేత కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అభిమానుల న‌డుమ కేక్ క‌ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మ‌హానేత జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హాల‌కు పాలాభిషేకం, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. తెలుగు ప్ర‌జ‌లు మ‌హానేత‌ను స్మ‌రించుకుంటూ, మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం రావాలంటే జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.
Back to Top