ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో మ‌హానేత జ‌యంతి వేడుక‌లు
- కేక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌
తూర్పు గోదావ‌రి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 69వ జ‌యంతి వేడుక‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసమస్యల పోరాటం చేస్తూ వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర ఆదివారం 208వ రోజుకు చేరుకుంది. ఇవాళ‌) దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ చిత్ర పటానికి వైయ‌స్ జ‌గ‌న్‌ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య  పార్టీ సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌తో భారీ కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజల సమక్షంలో జననేత పాదయాత్రను ప్రారంభించారు.  
 


Back to Top