పాదయాత్రపై ఎల్లుండి కీలక సమావేశం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరగనుంది. పాదయాత్రపై పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైయస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యచరణపై పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు సమాచారం అందించారు.

తాజా ఫోటోలు

Back to Top