మీ ప‌ద‌వి వైఎస్సార్ భిక్షే..!

కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భిక్షతోనే ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ బొమ్మపై గెలిచి రాజీనామా చేయకుండా అమరనాథ్ టీడీపీలో చేరడం దారుణమని ఆరోపించారు.ఆదివారం కడపలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప కార్పొరేషన్ మేయర్ సురేష్‌బాబుతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.  
ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమరనాథ్రెడ్డిని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆదినారాయణ కుటుంబం కష్టాల్లో ఉంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదుకుని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఆదినారాయణకు లేదని వారు అన్నారు.
Back to Top