ఇంటింటికీ వైయస్సార్‌ కుటుంబం

బుచ్చెయ్యపేటః మండలంలో మూడు గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు వైయస్సార్‌ సీపీ చోడవరం నియోజకవర్గ కన్వీనర్‌ కరణం ధర్మశ్రీ పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రం బుచ్చెయ్యపేట మాజీ ఎంపీటీసీ గణపతిరాజు రాంబాబురాజు ఇంటి వద్ద 32 పంచాయతీల బూత్‌ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటల నుండి ఇంటింటికి వైయస్సార్‌ కార్యక్రమం ప్రారంభమవుతొందన్నారు. గొర్లెపాలెం,సీతయ్యపేట,పెదపూడి గ్రామాల్లో ఇంటింటికీ వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల బూత్‌కమిటీ సభ్యులు,నాయకులు ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కొల్లిమల్ల అచ్చింనాయుడు నాయకులు సుంకరి గాంధీ,పాతాళ శ్రీను,దుర్గవరపు రవి,సుంకరి శ్రీను,కె నాగ అప్పారావు తదితర్లు పాల్గొన్నారు.

పాయకరావుపేటలో ఇంటింటికి వైయస్సార్‌కుటుంబం
నక్కపల్లి(పాయకరావుపేట): ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబం ద్వారా ప్రజలతో మమేకమవ్వాలని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన పాయకరావుపేట పట్ణణంలోపాండురంగ స్వామి దేవస్దానం ఏరియా, చాకలి పేట, తొమ్మిదో వార్డు తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వైయస్సార్‌ కార్యక్రమం న్విహించారు.ఈ సందర్బంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారికి పార్టీ సభ్యత్వాన్ని అందజేసి, పార్టీ ఏర్పాటు చేసిన ఫోన్‌ నెంబరుకు మిస్‌ కాల్‌ ఇచ్చి ఐవిఆర్‌ఎస్‌ ద్వారా జగన్‌తో మాట్లాడించారు. ఇంటియజమానులు వైయస్సార్‌ కుటుంబంలో చేరినట్లు గుర్తింపుకార్డు ఇవ్వడంతోపాటు, ఇంటితలుపుకు వైయస్సార్‌గుర్తుగా, జగనన్నకు తోడుగా అనే నినాదంతో ఉన్న స్టిక్కర్‌ను అతికించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించే అవకాశం ఏర్పడిందన్నారు. బూత్‌కమిటీ సభ్యులంతా ప్రజలతో మమేకం కావాలన్నారు. పార్టీని పటిష్టపరిచే చర్యల్లో బాగంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలంతా నవరత్నాలను అభినందిస్తున్నారని ఇవి అమల్లోకి రావాలంటే వైఎస్సార్‌సిపి ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఈప్రభుత్వం పట్ల, టీడిపి ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీ పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. అక్టోబరు 2 వరకు జరిగే ఇంటింటికి వైఎస్సార్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ప్రతి బూత్‌లోను ఈ కార్యక్రమం వెంటనే ప్రారంబించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు చిక్కాల రామారావు, వీసం రామకృస్ణ పార్టీ మండలశాఖ అద్యక్షుడు ధనిశెట్టిబాబూరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దగ్గుపల్లిసాయి. పార్టీనాయకులు బొడ్డావెంకటరమణ, ఆడారినూకరాజు,వంగలపూడి రాము, కోనేపుత్రరావు, దేవవరపు వెంకటేశ్వరరావు, పెనుముచ్చునాగేశ్వరరావు వంగలపూడి రాము, పప్పు శివ,డి నూకరాజు, బి బాబ్జి, పన్నీరు బాబ్జి, రామ్మోహన్‌రావు, చిక్కాలబాబు, ఆడారి ప్రసాద్, బి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top