వైయ‌స్ఆర్ ఆశయ సాధనకు కృషి

అనంత‌పురం(గుమ్మఘట్ట): పేదలకు సంక్షేమ పథకాలు వర్తింపజేసి, వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నమహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య సాధనకు అందరం కృషి చేద్దామని గుమ్మఘట్ట వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ గౌని కాంతారెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ ముఖ్య నాయకులు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, కురుబ సంఘం అధ్యక్షులు రామాంజినేయులు, మిద్దింటి ధనుంజయ్య అన్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 8వ వర్థంతి సందర్భంగా గుమ్మఘట్ట, ఆర్‌ కొత్తపల్లి, పూలకుంట గ్రామాలలో వైయ‌స్ఆ ర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో రంగసముద్రం, పూలకుంట సర్పంచులు అనసూయమ్మ, ముసలిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, బీటీపీ అంగడి తిప్పేస్వామిరెడ్డి, గిరిరెడ్డి, గుమ్మఘట్ట మాజీ సర్పంచ్‌ చిత్రశేఖరప్ప, చిదానందరెడ్డి, గోవిందరెడ్డి, తిప్పేస్వామి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ బాషా, ఖాజా, అంగడి ఆదిమూర్తి, పి.మంజునాథ, సి.మల్లి, అశ్వర్థరెడ్డి, మల్లప్ప, మల్లెశి, బీటీపీ ఏకాంత, రామాంజి, కోనాపురం నాగిరెడ్డి, వెంకటరెడ్డి, గోనబావి వడ్డే గోవిందు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
====================
బ్ర‌హ్మ‌స‌ముద్రంలో వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి  
బ్రహ్మసముద్రం: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 8వ వర్దంతి వేడుకలను శనివారం బ్ర‌హ్మ‌స‌ముద్రం మండ‌లంలో నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ మండ‌ల‌ కన్వీనర్‌ రామాంజినేయులు అధ్వర్యంలో మ‌హానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు ఈ సందర్బంగా వైయ‌స్ఆర్‌ పేదప్రజల సంక్షే మం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ,గుర్తు చేశారు అయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ  సీనియర్‌ నాయకుడు ఆనందప్ప, యస్సీసెల్‌ నాయకులు దేవపుత్ర, ఆనంద్, మారెన్న ,ఆంజనేయులు యువత నాయకులు గోవింద్,మారుతి, సంజీవప్ప, జయన్న కొడిపల్లి గోవింద్‌ ,పలువురు కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు. 
రొద్దంలో.. 
దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి వేడుకలను రొద్దం మండ‌లంలో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి లేని లోటు ప్రజలు స్పష్టంగా కనబడు తోందన్నారు. రాష్ట్రనికి ధీటైన నాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా చోటు సంపాదించిన వ్యక్తి ఒక వైయ‌స్‌ఆర్‌ అన్నారు. పేదలను ఆదుకోవడానికి పార్టీలకు అతీంతగా అనేక సంక్షేమ పథాకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి దివంగతనేత అన్నారు.కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్,సింగిల్‌ విండో డైరెక్టర్‌ మారుతిరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి,వజీర్‌బాషా,మంజుస్వామి,కాటిమ తిమ్మారెడ్డి,మండల కమిటీ సభ్యులు రవిశేఖర్‌రెడ్డి,బీటీ కృష్ణారెడ్డి,సినిమా నారాయణ,అమిర్,చెక్‌పోస్ట్‌ లక్ష్మినారాయణ,శ్రీనివాసులు,పోతన్న,పోలేపల్లి జీవప్పరంగయ్య, అంజినరెడ్డి,నరసారెడ్డి,ఓబుళేసు,ఎం.కొత్తపల్లి నాగరాజు,వెంకటేసులు తదితర పలువురు నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

యాడికిలో.. 
తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం యాడికి మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ బొంబాయిరమేష్‌నాయుడు ఆధ్వర్యంలో శనివారం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మ‌హానేత విగ్ర‌హానికి పార్టీ నాయకులు కాసాచంద్రమోహన్, శ్రీరాములు, మధురాజు, రామ్హోన్, తిరుపతి, వెంకటరామిరెడ్డి, వెంకటరాముడు, కోటాచౌదరి, కోడిచంద్ర పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రాయలచెరువులోని లీలావతి వృద్ధాశ్రమంలోని వృద్దులకు అన్న సౌకర్యాం కల్పించారు. అలాగే వికలాంగ పిల్లలకు బికెట్లు, పండ్లును అందజేశారు. 

న‌ల్ల‌మాడ‌లో..
పుట్టపర్తి నియోజకవర్గంలోని న‌ల్ల‌మాడ‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి వేడుక‌లు నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పలువురు ముస్లిం సోదరులకు శ్రీ‌ధ‌ర్‌రెడ్డి బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు తెలిపారు.  కార్య‌క్ర‌మంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎన్‌హెచ్‌ బాషా, మహమ్మద్‌ రఫీ, మిలటరీ కుళ్లాయప్ప, షంషీర్, అన్వర్‌బాషా, షబ్బీర్, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.  
-----------------------
రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ
కళ్యాణదుర్గం: మహానేత, దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ అన్నారు. వైయ‌స్ఆర్ ఎనిమిదవ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వైఎస్సార్‌ఫార్కులో సమన్వయకర్తతో పాటు పట్టణ కన్వినర్‌ గోపారం శ్రీనివాసులు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ప్రచారకమిటీ జిల్లా ప్రధానకార్యదర్శి నరేంద్రరెడ్డి,మైనార్టీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదాఖలందర్,ఎస్సీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర,దొణతిమ్మ,బీసీసెల్‌ అధ్యక్షుడు నాగరాజుస్వామి,సేవాదల్‌ గుప్తా, తదితరులు మహానేత విగ్రహానికి పూలమాలలువేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త మాట్లాడుతూ..ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేవారన్నారు.రైతుల,కూలీలు,కార్మికులు,ఆరోగ్యశ్రీ పథకంతో లబ్దిపొందిన వారు ఎందరోవున్నారన్నారు.తిరిగి రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటుంన్నారన్నారు. వైయ‌స్ జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం సమన్వయకర్త నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయడంజరిగింది. కార్యక్రమంలో నాయకులు లోకేష్‌రెడ్డి,బీసీసెల్‌ నాయకులు గాజుల అంజి,ఆనంద్,మల్లి,కొండారెడ్డి,మారుతి,బిక్కిహరి,గోపాల్,రాము,వర్లి తిప్పేస్వామిగౌడ్,ఎల్‌ఐసీ మురళి,పరమేశ్వరప్ప, హంపన్న,నట్రాజ్,ముత్తరాశనాగరాజు,మహిళా జిల్లా ప్రధానకార్యదర్శి కాంతం,నాయకులు కృష్ణారెడ్డి,కేశవరెడ్డి,బలరాం,ఎంఎస్‌ఎఫ్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.
బోరంపల్లిలో...........
మండల పరిధిలోని బోరంపల్లి గ్రామంలో మహానేత వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలను శనివారం జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు విజయ్‌భస్కర్‌రెడ్డి,అంజినరెడ్డి,కృష్ణారెడ్డి,బలరాం,హెచ్‌ఎం రామాంజినేయులు,శివారెడ్డి,ఆనం భాస్కర్‌రెడ్డి,మంజునాథరెడ్డి,బండీ మధుసుధన్‌రెడ్డి,సుధాకర్, మొద్దుశీను తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు.అదేవిధంగా పలు గ్రామాలలో వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో...........
కళ్యాణదుర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో శనివారం వైఎస్సార్‌ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.నాయకులు బాలనరేంద్రబాబు,సుధీర్,రాయపాటి అశోక్,జోషఫ్‌కిషోర్,బాలావీనాతదితరులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు.
Back to Top