వైయస్‌ఆర్‌ జిల్లా రైతులంటే బాబుకు చిన్నచూపు


కేసీ కెనాల్‌ నీటి విడుదల కోసం వైయస్‌ఆర్‌సీపీ ధర్నా
వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ జిల్లా రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మండిపడ్డారు. కేసీ కెనాల్‌కు నీటిని  విడుదల చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా చేపట్టారు. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అంజాద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై సగం రోజులు కావస్తున్నా..ఇప్పటికీ నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయకపోతే తరువాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.


కేసీ కెనాల్‌కు నీరిచ్చే ఆలోచన ఉందా: వైయస్‌ అవినాష్‌రెడ్డి
కేసీ కెనాల్‌కు నీరిచ్చే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. 

రైతుల జీవితాలతో బాబు చెలగాటం: ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి
చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. కేసీకి నీరివ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే అంజాద్‌బాషా హెచ్చరించారు.  
Back to Top