అమెరికాలో వైయస్ఆర్ వర్థంతి కార్యక్రమం

సెయింట్ లూయిస్: అమెరికా సెయింట్ లూయీస్ లోని మయూరీ రెస్టారెంట్ లో  వైయస్ఆర్ సీపీ నాయకులు, అభిమానులు మహానేత ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ యూఎస్ఏ కన్వినర్ రత్నాకర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వైయస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.
 
ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో పేదలు, రైతులకు వైయస్ఆర్ అందించిన సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. మహానేత ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ సెంయింట్ లూయిస్ కన్వీనర్ శేఖర్ రెడ్డి దండు, భార్గవ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top