ప్రకాశం బ్యారేజ్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ధర్నా

విజయవాడ, 25 జూన్‌ 2013:

కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంనాడు ప్రకాశం బ్యారేజ్పై ధర్నా నిర్వహించింది. సముద్రంలోకి వృథాగా వెళ్ళిపోతున్న నీటిని మళ్ళించి పొలాలకు అందించాలని డిమాండ్ చే‌సింది. కేవలం కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు తప్పితే రైతులను పట్టించుకోవడం లేదని ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, నాగిరెడ్డి, ఉప్పులేటి కల్పన, పడమటి సురేష్ బాబు‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top