వరద బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పరామర్శ

రుషికేష్‌‌ (ఉత్తరాఖండ్),

27 జూన్‌ 2013: ఉత్తరాఖం‌డ్ వరద బాధితులను వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, గొల్ల‌ బాబురావు గురువారం పరామర్శించారు. హిమాలయన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగువారిని వారు కలుసుకుని ధైర్యం చెప్పారు. రుషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమానికి కూడా వారు చేరుకుని అక్కడున్న బాధితులను పరామర్శించారు. భారీ వరదల కారణంగా బాధితులు పడుతున్న అవస్థలను వారు వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో వారం రోజులుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Back to Top