రెండవ దశలోనూ వైయస్ఆర్‌ కాంగ్రెస్పే ఫస్ట్

హైదరాబాద్, 27 జూలై 2013:

పంచాయతీ సర్పంచ్‌ల ఫలితాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రభాగంలో నిలిచిందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. అత్యధిక మంది ప్రజల విశ్వాసాన్ని చూరగొని రాష్ట్రంలో నంబర్‌ వన్‌ పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నిలిచిందన్నారు. పంచాయతీ ఎన్నికల తొలి, మలి విడతల ఫలితాల్లో 2,852 స్థానాల్లో పార్టీ మద్దతుదారులు విజయాలు సాధించారని రామచంద్రరావు తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని పార్టీ సాధించేందుకు అహరహం శ్రమించిన పార్టీ కార్యకర్తలు, విజేతలకు ఆయన అభినందనలు తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు గట్టు ధన్యవాదాలు తెలిపారు. మూడవ దశ ఎన్నికల్లో కూడా పార్టీ ఇదే హవాను కొనసాగించనున్నదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

పార్టీ కేంద్ర కార్యాలయానికి శనివారం సాయంత్రం 5.45 నిమిషాల వరకూ వచ్చిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు ఆయన చెప్పారు. తొలి విడత కన్నా మలి విడతలో పార్టీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో విజయాలు సాధిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2,500 చిల్లర స్థానాలతో రెండవ స్థానంలో ఉందన్నారు. 2,300 సీట్లు గెలిచి టిడిపి మూడవ స్థానంలో ఉందన్నారు. కాగా టిఆర్ఎస్‌కు 660 పైచిలుకు పంచాయతీ సర్పంచ్‌ పదవులు వచ్చాయన్నారు.

తాజా వీడియోలు

Back to Top