చిలకలూరిపేటలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సదస్సు

గుంటూరు, 24 జూన్ 2013:

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వై.యస్.విజయమ్మ ఇందులో పాల్గొంటారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు రాజకీయ నిర్దేశం చేస్తారు. సోమవారం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చిలకలూరిపేటలో నన్నపనేని వెంకటరత్నం కల్యాణమండపంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు సాగుతుంది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర నేతలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ,  నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకులు హాజరు కానున్నారు. శ్రీమతి విజయమ్మ సోమవారం ఉదయం 8.30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు చేరుకుంటారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పార్టీ జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్ తెలిపారు.

Back to Top