గడపగడపలో ఒకే నినాదం..వైయస్సార్ కాంగ్రెస్

హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈసమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు.  ఈనెల 8వ తేదీనుంచి పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న  గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. 
బాబు రెండేళ్ల అవినీతి, మోసపూరిత పాలనను ప్రతి గడపలో ఎండగట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకు గానూ వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను కరపత్రంలో ముద్రించి ప్రజలకు అందివ్వనున్నారు. అదేవిధంగా రెండేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజా పోరాటాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి వివరించనున్నారు. 

మరోవైపు, పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ వైయస్ జగన్ ను కలుసుకుంది. సదావర్తి భూములపై నివేదిక అందజేసింది. అమరావతి, చెన్నైలలో కమిటీ సభ్యులు భూములను పరిశీలించి నివేదిక రూపొందించారు.  అమరావతి సదావర్తి సత్రం భూముల్లో టీడీపీ నేతలు వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన పథ్యంలో.... దీనిపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వైయ‌స్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది.  

Back to Top