ఊరూరా ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’

 


- ఇంటింటా న‌వ‌ర‌త్నాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌చారం 
- వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
-  సమస్యలపై నేతల వద్ద ఏకరువు పెడుతున్న ప్రజలు

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించిన  ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది.  పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నేతలు ఇంటింటికీ వెళ్లి వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాల గురించి తెలియజేస్తున్నారు. అనంతపురం నగరం భవానీనగర్, రాణీనగర్, ఫెర్రర్‌కాలనీల్లో కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త  తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటూ రోగాలబారిన పడుతున్నామని మహిళలు షాహీదా, లక్ష్మీ, మాలతి, పార్వతమ్మ, లత వాపోయారు. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంకాలమ్మ గుడి అర్చకుడు లక్ష్మీనారాయణ ఆచారి తాను ఇంటి కోసం పడుతున్న ఇబ్బందులను అనంత వెంకటరామిరెడ్డి ఎదుట వాపోయాడు. 

- ఉరవకొండ నియోజకవర్గం  వజ్రకరూరు మండలం కమలపాడు  గ్రామంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. గ్రామంలో రోడ్లు లేవని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు సుంకమ్మ, లక్ష్మీదేవి, నెట్టికంటమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వితంతు పింఛను మంజూరు చేయలేదంటూ లలితమ్మ అనే మహిళ వాపోయింది. 

- ధర్మవరం పట్టణం 5వ వార్డు శివానగర్‌లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పర్యటించారు. కాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదని దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.

-  గుంతకల్లు నియోజకవర్గం పామిడి మునిసిపాలిటీ 7వ వార్డు, గుత్తి మండలం యంగన్నపల్లి, బేతాపల్లిలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమస్వయకర్త వై. వెంకటరామిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేశారు. 

-కదిరి మున్సిపాలిటీ నాగిరెడ్డిపల్లి, పేరిపల్లి క్వార్టర్స్‌లో సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి పర్యటించారు. మురుగుకాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా... పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. స్పందించిన సిద్ధారెడ్డి... సొంత నిధులతో శుభ్రం చేయించి మురుగునీటి కోసం గుంత తవ్విస్తానని హామీ ఇచ్చారు. 

-  కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి, వంకతండా గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ పర్యటించారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పే వారికే పథకాలు అమలు చేస్తున్నారని సుశీలమ్మ అనే మహిళ వాపోయింది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మరో మహిళ వాణీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జగన్‌ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి అందరికీ మంచి జరుగుతుందని ఉషాశ్రీ చరణ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. 

- చిత్తూరు జిల్లాలోని తిరుపతి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహాస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. నాయకులు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రతి తలుపునూ తట్టి నవరత్నాలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.

⇔ తిరుపతి 10వ వార్డులోని కొర్లగుంటలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పర్యటించారు. నవరత్నాలను ప్రజలకు వివరించారు. వైయ‌స్‌ జగన్‌ పాలనలో మళ్లీ రాజన్న పాలనను పొందవచ్చన్నారు.  
⇔ నవరత్నాలతో పేదరికం దూరమవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లి, కందూరు, తమ్మినాయునిపల్లి పంచాయతీల్లో జరిగిన రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు విన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయని చెప్పారు.
⇔ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మె ల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. ఎస్సార్‌పురం మండలం ముదికుప్పం పంచాయతీలో గడపగడపకూ తిరుగుతూ నవరత్నాలను ప్రజ లకు వివరించారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్, అమ్మ ఒడి పథకాలతో పేద పిల్ల లు పెద్ద చదువులు చదువుకునే అవకాశం ఉందన్నారు.
⇔ కుప్పం నియోజకవర్గం కంగుందిలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల సమస్యలు విన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయింస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా నీటితో కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
⇔ శ్రీకాళహాస్తిలో గురువారం రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ నవరత్నాలను వివరించారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు రాజన్న రాజ్యంలో మేలు జరిగిందన్నారు. రిటైర్డ్‌ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్‌ బాలశౌరి వైఎస్సార్‌సీపీలో చేరారు.
⇔ చిత్తూరులోని మురకంబట్టులో జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. మురకంబట్టులో ప్రతి ఇంటికీ నవరత్నాల్లోని పథకాల వివరాలు ముద్రించిన కరపత్రాలను పంచారు. స్థానిక  సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
⇔ సత్యవేడు బుచ్చినాయుడు కండ్రిగ కాటూరులో గురువారం రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. ఆదిమూలం పాల్గొన్నారు. ప్రజా సమస్యలు విన్నారు.
⇔ పలమనేరు నియోజకవర్గ ఇంచార్జి వెంకటే గౌడ పెద్దపంజాణిలో నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు. పరిష్కరించేందకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలను వివరించారు.

♦ శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి.. కావాలి జగన్‌..రావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు బూత్‌ల్లో ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అవినీతి, అక్రమాలను వివరించి ప్రజలను చైతన్య పరచారు.  

♦ పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్‌ మండలంలోని 34వ వార్డు చింతలముని నగర్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి  పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు.  


♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొని నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

♦ ఆలూరు నియోజవకర్గంలోని హాలహర్వి మండలం బి.చాకిబండ, దేవినేహాలు గ్రామాల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి నవరత్నాలు, టీడీపీ అవినీతి అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు శ్రీనివాసరెడ్డి, కల్యా గౌడ్, భీమస్ప చౌదరి పాల్గొన్నారు.  

♦ మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని జంపాపురంలో  ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొని టీడీపీ అవినీతి, అక్రమాలు, నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, బెట్టనగౌడ్, ఇల్లూరి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.  

♦ నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం పసురుపాడులో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మల్కిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

♦ ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామంలో పార్టీ నేత ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న., వెంకటరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.  

♦ పత్తికొండ నియోజకవర్గం దూదేకొండలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో  భారీ బహిరంగసభ సభ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంచిపెట్టారు. అంతకముందు మెయిన్‌రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మద్దికెరలో కూడా నవరత్నాల కరపత్రాలను శ్రీదేవి ఆవిష్కరించారు.  

♦ ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలంలోని మహదేవపురంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు.  

కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల గ్రామంలో పార్టీ ఇన్‌చార్జ్‌ పరిగెల మురళీకృష్ణ ..నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. 


Back to Top