జమ్మలమడుగులో ఉక్కు సంకల్ప దీక్ష

– కడప ఉక్కు పరిశ్రమ కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష
– దీక్షలో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు
 
వైయ‌స్ఆర్ జిల్లా:  కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైయస్‌ఆర్‌సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇవాళ జ‌మ్మ‌ల‌మ‌డుగు ప‌ట్ట‌ణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఉక్కు సంక‌ల్ప దీక్ష చేప‌ట్టారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ.. కడపలో ఇప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కడపలో వెంటనే స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 23న క‌డ‌ప న‌గ‌రంలో మ‌హాధ‌ర్నా, 24న బ‌ద్వేలు, 25న రాజంపేట‌లో ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం జ‌మ్మ‌ల‌మ‌డుగు ప‌ట్ట‌ణంలో సంక‌ల్ప దీక్ష చేప‌ట్టారు.   ఈ సందర్భంగా కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, టీడీపీ, బీజేపీ నేతల మోసపూరిత వైఖరిపై పార్టీ నేతలు మండిపడ్డారు. కడప్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేమిటని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  తలపెట్టిన స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని.. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సంక‌ల్ప దీక్ష‌లో వైయ‌స్ఆర్‌సీపీ రాయ‌ల‌సీమ ఇన్‌చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైయస్‌ ప్రమీలమ్మ, వైయస్‌ మనోహర్‌రెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి,  సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మల్లికార్జునరెడ్డి, సీపీఎం, సీపీఐ, 10 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. 
 

  
Back to Top