కొన‌సాగుతున్న రిలే దీక్ష‌లు


గుంటూరు:  ఏపీకి సంజీవ‌ని లాంటి ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ దీక్ష‌లు చేప‌ట్టారు. ఢిల్లీ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తూ నిరసనను హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. గురువారం ఈ దీక్ష‌లు ఆరో రోజుకు చేరుకున్నాయి. అలాగే ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఈ నెల 10న జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధం చేశారు. అలాగే 11న‌ రైలురోకో ద్వారా ఆందోళనను వ్యక్తం చేశాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నాయి. మండుటెండను సైతం పట్టించుకోకుండా హోదా కోసం పార్టీ నాయకులు..కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. 
శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో ఆరో రోజు చేప‌ట్టిన రిలే నిరాహార దీక్ష‌ను నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ప్రారంభించ‌గా, సిద్ధ‌ప‌ల్లికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ యువ‌నాయ‌కులు దీక్ష‌లో కూర్చున్నారు. పార్టీ నాయ‌కులు రేనాటి ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మార్త భాస్క‌ర్‌, యువ‌నాయ‌కులు చంద్రారెడ్డి, శ్రీ‌నివాసులు, సుంక‌న్న‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top