ఊపందుకున్న ఉక్కు ఉద్య‌మం


- వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా
- భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం
 
 సాక్షి, కడప‌: విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. ఇటీవ‌ల పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ప్రొద్దుటూరు వేదిక‌గా 48 గంట‌ల దీక్ష చేప‌ట్టారు. ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కడపలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్‌ వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహాధర్నాను ప్రారంభించింది. దివంగత నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నాయ‌కులు మహాధర్నాను ప్రారంభించారు. జూన్‌ 23 నుంచి 26 వరకు కడప జిల్లాలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న(జూన్‌) బద్వేలులో మహా ధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, 26న జమ్మలమడుగులో భారీ దీక్ష చేపడుతున్నారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌కు అధిక సంఖ్య‌లో జ‌నం, పార్టీ నాయ‌కులు చేరుకోవ‌డంతో కిక్కిరిసిపోయింది. క‌డ‌ప‌ ఉక్కు..రాయ‌ల‌సీమ హ‌క్కు అంటూ నిన‌దిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, రాజంపేట  పార్లమెంట​ అధ్యక్షుడు అమర్‌నాథ్‌ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
 

  
Back to Top