తూర్పుగోదావ‌రి జిల్లాలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు


రాజ‌మండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జరిగాయి. రాజమండ్రిలో పార్టీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో, రాజోలులో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో, పి.గన్నవరం నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాల‌యాల్లో కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని పార్టీ నాయ‌కులు ఆశాభావం వ్య‌క్తం చేశారు.
Back to Top