వైయస్‌ఆర్‌ సిద్ధాంతాలే పార్టీ ఎజెండా

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పార్థసారధి, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు, జోగి రమేష్, తోట శ్రీనివాస్, షేక్‌ ఆసిఫ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షపై నిరంతరం పోరాడుతుందని, ప్రజా సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ చేసిన ఉద్యమాలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని సీఎం రమేష్, నారాయణలు వైయస్‌ జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సిద్ధాంతాలే ఎజెండాగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు. 
Back to Top