ప్రజలకు అండ..వైయస్సార్సీపీ జెండా

ఆత్మగౌరవం.. పార్టీ పేరు పక్కన చేరిస్తే వచ్చేది కాదు. ‘ప్రత్యేక’ పరిస్థితుల్లోనూ నిరూపించుకునేది..
ఆత్మాభిమానం.. ఢిల్లీలో దించిన తల.., గల్లీకి వచ్చాక ఎగరేయడం కాదు. ఎదిరించాల్సి వచ్చినా ధైర్యంగా వెనకడుగు వేయక పోరాడటం. 
మాటతప్పనితనం.. ప్రాంతాలు మారినప్పుడు, పార్టీలు మారినప్పుడు మార్చేయడం కాదు. ఓటమే ఎదురైనా మాటకు కట్టుబడి ఉండటం. 
నీతి, నిజాయతీ, నిబద్దత.. నేర్చుకుంటే వచ్చే గుణాలు కావు.. పుట్టుకతోనే వచ్చే ఆభరణాలు.. 
ఇన్ని లక్షణాలతో ఈ రోజుల్లో ఒక మనిషిని ఎక్కడో కానీ చూడలేం.  అదే రాజకీయ నాయకులైతే అరుదుగా కనిపిస్తారు. మరి ఒక పార్టీ అధ్యక్షుడైతే ఒక్కరే కనిపిస్తారు... ఆయనే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సందేహం అక్కర్లేని నిజం. ఆత్మగౌరవం పేరు చెప్పి గుండీలు పీక్కోలేదు కానీ.., గుండె నిబ్బరంగా పార్టీని నడుతున్న ధీశాలి. ఆత్మాభిమానం చంపుకోలేక పదవులనే తృణప్రాయంగా వదులుకున్నాడు. సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చాడేమో కానీ మాట మార్చలా. అన్ని లక్షణాలతో ఒక మనిషి ఉండటం, కష్టమైన పరిస్థితిల్లోనూ కోట్లాది ప్రజల అభిమానం.. లక్షల్లో ప్రాణాలిచ్చే యువతను సంపాదించుకోవడం.. నేను జగన్‌ అభిమానిని అని వారు గర్వపడేలా బతకడం చిన్న విషయం కాదు. ఒక్క రోజులో వచ్చింది కాదు. వెలకట్టి కొనుకున్నదీ కాదు. దీనివెనుక ఏడేళ్ల పోరాటం ఉంది. టన్నుల కొద్దీ ఓర్పూ.. వెలకట్టలేని నిజాయతీ ఉంది. జనం కోసం.. జనం చెంత.. జనం పక్షాన చేసిన పోరాటాలే ఆయన్ను జననేతను చేశాయి. అధికారం ఇచ్చి పట్టాభిషేకం చేయకపోయినా ఏడేళ్ల నిర్విరామ కృషిని గుర్తించి గుండెల్లో స్థానం కల్పించారు. ప్రతి ఇంటా పెద్ద కొడుకుని చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా జన హృదయ నేత ముఖ్యమైన మూడు సందర్భాల్లో చెప్పిన మాటలు..

మీ అభిమానం ప్రియతమ నాయకుడు వైయస్‌ రాజశేఖర‌రెడ్డిని ఎప్పటికీ మన నుంచి దూరం కానీయదు. ఆయనెప్పటికీ మన కళ్ల ముందే ఉంటారు. నవ్వే ప్రతి చిరునవ్వులోనూ రాజశేఖర‌రెడ్డి ఉంటారు. ఆ చిరునవ్వులో నేనూ భాగమవుతా. ఆ ప్రియతమ నాయకుడు నాకో పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. మీ అందరిలో నేనూ ఒక్కడినవుతా. అందరం కలిసికట్టుగా రాజశేఖరుడి ఆశ‌యాల‌ను సాధిద్దాం.. తాను కలలు కన్న ప్రతి స్వ‌పాన్ని నెరవేరుద్దాం. చనిపోయిన ప్రతికుటుంబాన్ని రాబోయే రోజుల్లో స్వయంగా వచ్చి కలుస్తా. నన్ను మీ కుటుంబంలో ఒక్కడిగా గుర్తుపెట్టుకోండి. 
– నల్లకాలువ సభలో ఓదార్పు యాత్రను ప్రారంభించబోతూ 

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యం. అదే వైయస్‌ఆర్‌ కల. ఆ కలను సాకారం చేయడానికి నిరంతరం కష్టపడతా. ఆ లక్ష్యాన్ని నెరవర్చేందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపిస్తున్నాం. రేపే ఇడుపులపాయలో పార్టీ జెండాను ప్రియతమ నాయకుడు వైయస్‌ఆర్‌ పాదాల సాక్షిగా ఆవిష్కరిస్తాం. మేధావులు, అభిమానులతో రెండు రోజులు ప్లీనరీ నిర్వహిస్తాం. మేధోమథనం చేసి పార్టీ విధివిధానాలను ప్రకటిస్తాం. 
– మార్చి11, 2011న జగ్గంపేట సభలో 

వైయస్‌ఆర్‌ ఆశయ సాధనే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపిస్తున్నాం. ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పనిచేస్తాం. వైయస్‌ఆర్‌ ఆశయసాధనకు.. రాజన్న రాజ్యం నిర్మించడమే మా ఉద్దేశ్యం. వైయస్‌ఆర్‌ కడుపున ఆణిముత్యమే పుట్టాడని నిరూపిస్తా. వందేళ్లు వైయస్‌ఆర్‌ను మర్చిపోలేని విధంగా ఆయన కలలు కన్న సువర్ణ యుగాన్ని సాధించడమే లక్ష్యంగా  పనిచేస్తా. నన్ను చూసి అందరూ గర్వపడేలా బతుకుతా. 
- వైయ‌స్ జ‌గ‌న్‌

పార్టీ జెండాను (బులుగు, తెలుపు, ఆకుపచ్చ) మూడు రంగుల్లో తయారు చేసుకున్నాం. జెండాలో మధ్యన వైయస్‌ఆర్‌ చిత్రపటం ఉంటుంది. సమాజంలో అన్ని వర్గాలను ప్రతిబింబించేలా జెండాను రూపకల్పన చేశాం. పార్టీ పేరులోనూ యువజన, శ్రామిక, రైతులను చేర్చాం. 
- వైయ‌స్ జ‌గ‌న్‌

పేదరికాన్ని నేను చూసినంత దగ్గరగా ఎవరూ చూసుండరు. ప్రతి కుటుంబంతో దాదాపు 20 నిమిషాలు గడిపా. ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కథ. వారి కష్టాలన్నీ విన్న తర్వాత నా మెదడులో ఆలోచన వచ్చింది. ప్రతి ఇంటి నుంచి సమస్యలను పారదోలాలంటే ముందుగా రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలాలని. దీనికి రెండు మార్గాలున్నాయి. అది చదువుతోనే సాధ్యం. ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం చేయాలి. ఎలాంటి ఆర్థిక సమస్యలతోనూ చదువులు ఆగిపోకూడదు. ‘అమ్మ ఒడి’ పేరుతో పథకం రూపొందిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి కుటుంబంలో ఇద్దర్ని ఉచితంగా చదివించే బాధ్యత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుంది. అధికారంలోకి వస్తే వారి చదువులకయ్యే ఖర్చును నేరుగా వారి తల్లి అకౌంట్‌లోకి జమయ్యే విధంగా చూస్తాం. 
ప్రతి కుటుంబానికి వ్యవసాయ యోగ్యమైన ఎకరం భూమిని ఉచితంగా పంచిపెడతాం. 
– మార్చి 12, 2011న పార్టీ ఆవిర్భావ సభలో 
Back to Top