భీమవరంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ మహాధర్నా

భీమవరం (ప.గో.జిల్లా),

10 ఆగస్టు 2013: రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగా ఉంచాలి డిమాండ్‌ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారంనాడు మహా ధర్నా జరిగింది. భీమవరంలోని ప్రకాశం చౌక్‌లో సమైక్యాంధ్రవాదులు ఈ మహాధర్నానిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఐదు వేల మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల హాజరయ్యారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘరామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top