సమైక్య ఉద్యమంపై చర్చించాం

హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసే ఉద్యమం కోసం సీపీఎంతో చర్చించామని  వైయస్ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు డాక్టర్  ఎమ్.వి మైసూరా రెడ్డి వెల్లడించారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో  తమ మధ్య చర్చలు సాగాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఐక్యత కోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా రెడ్డి తెలిపారు.  ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉంది కాబట్టి కలిసి ఉద్యమిద్దామనే కోణంలో ఆ పార్టీ నేతలతో చర్చించామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ చర్చల్లో పాల్గొన్న బి.వి.రాఘవులు అనంతరం మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ బృందం కలిసి పనిచేద్దామని తమతో ప్రతిపాదించిదన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపినట్లు రాఘవులు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top