రాష్ట్రపతి చెంతకు వైయస్ఆర్ కాంగ్రెస్ బృందం

హైదరాబాద్ 26 జూన్ 2013

: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బుధవారం  రాత్రి ఏడు గంటలకు వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని వారు ఈ సందర్బంగా ప్రణబ్కు విజ్ఞప్తి చేయనున్నారు. ప్రణబ్ ముఖర్జీని కలవనున్న వారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, గొల్ల బాబూరావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top