వినాయకం కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ సహాయం

పూతలపట్టు 28 జూన్ 2013:

ఉత్తరాఖండ్లో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన వీరజవాను  వినాయకం కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్  నేత మిథున్ రెడ్డి పరామర్శించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిన్నబండపల్లె గ్రామానికి చెందిన  కృష్ణ, రాణెమ్మ దంపతులకు వినాయకం ఏకైక కుమారుడు. తండ్రి కూలీనాలీ చేసి అతడిని డిగ్రీ వరకు చదివించాడు. వినాయకం 2009లో ఎన్‌డీఆర్ఎఫ్‌లో జవానుగా చేరాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయపడేవాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేశాడు. ఈ మధ్యనే వినాయకానికి కూడా అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం  సంభవించింది.

Back to Top