ప్రత్యేక హోదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

* రాష్ట్రంలో బంద్‌లు, ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు
* పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్‌పై పోరాటాలు
* రాష్ట్రపతి, ప్రధానిలకు హోదా ఇవ్వాలని వినతులు
* ప్లీనరీలో ప్రత్యేక తీర్మానం
* హోదా ఇచ్చేవాళ్లకే మద్దతు ఇస్తామన్న వైయస్‌ జగన్‌
* ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాటం

‘‘పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇస్తే.. తాము అధికారంలోకి వస్తే  ఏపీకి 5 ఏళ్లు కాదు.. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ పార్టీలు ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చాయి. అయితే తమ స్వార్థ పూరిత రాజకీయాల కోసం 5 కోట్ల ఆంధ్రుల హక్కు అయిన  హోదాను పక్కన పెట్టిన ప్రజలను మోసం చేశాయి. కాగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ గత నాలుగేళ్లుగా వివిధ మార్గాల్లో పోరాటాలు చేస్తూనే ఉంది. హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తూనే ఉంది. ఏపీకి ఎవరైతే హోదా ఇస్తారో ఆ పార్టీకే తమ మద్దతు అనికూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇదివరకే పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా ‘‘సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18’’ న్యూస్‌ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని మరొక్కమారు కుండబద్దలు కొట్టారు. 

హోదా కోరుతూ పోరాటాలు

ప్రత్యేక హోదా ఇస్తామని.. తెస్తామని మాట తప్పిన ప్రభుత్వాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో  గత నాలుగేళ్లుగా పోరాటాలు.. ధర్నాలు.. దీక్షలు చేస్తూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా వైయస్‌ జగన్‌ మంగళగిరిలో రెండు రోజులపాటు, గుంటూరులో 7 రోజుల పాటు నిరాహార దీక్షలు  చేశారు. హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు బంద్‌ కార్యక్రమాలకు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ పిలుపునిచ్చి ప్రభుత్వాలకు ప్రజల ఆకాంక్షను తెలియజేసింది. 

పార్లమెంట్‌..అసెంబ్లీలోనూ హోదాపై పట్టు

పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగా వినిపించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశాలు జరిగే సమయాల్లో నల్లదుస్తులు వేసుకుని నిరసన తెలిపారు. 

ప్లీనరీలోనూ ప్రత్యేక తీర్మానం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో గత ఏడాది జూలై 8, 9 తేదీల్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా ప్రత్యేక హోదాపై ప్రత్యేక తీర్మానం చేశారు. హోదా సాధించే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ప్రతినబూనారు. 

హోదాకు తూట్లు పొడిచిన బాబు

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తుంటే.. చంద్రబాబు హోదా రాకుండా అడ్డుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, దీక్షలు చేపడితే ఆ పార్టీ నాయకులను పోలీసులతో బాబు అరెస్టులు చేయించారు. లాఠీలతో కొట్టించారు. అంతేకాదు ప్రత్యేక హోదాను కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే చంద్రబాబు దగ్గరుండి బలవంతంగా బస్సులు నడిపించారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బయట పడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టుపెట్టారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారు. రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.

తాజాగా...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే తమకు ప్రధానమని, హోదా ఎవరిస్తే వారికి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘‘సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18’’ న్యూస్‌ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మరోమారు స్పష్టం చేశారు.  ప్రత్యేక హోదాను ప్రధాన మంత్రి మోడి ఒక్క సంతకంతో మంజూరు చేయవచ్చని, ప్రధాని  ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
Back to Top