ఉద్యమ ఉద్ధృతికి తీర్మానం: అంబటి

హైదరాబాద్ 20 సెప్టెంబర్ 2013:

సమైక్య ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్ణయించింది. లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీమతి వైయస్ విజయమ్మ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. శుక్రవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు తలపెట్టిన ధర్నాను భగ్నం చేసి, అరెస్టు చేయడాన్ని తీర్మానం ఖండించింది. మరో ప్రజా ప్రస్థానం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన శ్రీమతి షర్మిలను అభినందించింది. ఉద్యమ ఉద్ధృతికి ఏఏ చర్యలు చేపట్టాలో అన్నింటిని చర్చించారు. చంద్రబాబు సహా సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు.

సమావేశంలో పాల్గొన్న షర్మిల

ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో శ్రీమతి వైయస్ షర్మిల కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం  పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు కానున్న సమావేశ అజెండాను ఇందులో చర్చించారు.  పార్టీ సీఈసీ సభ్యులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శనివారం  ఉదయం సీజీసీ నేతలతో పాటు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులందరితో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్య ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరించడం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు వీడి సమైక్యం కోసం ఉద్యమించేలా ఒత్తిడి పెంచడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.

తాజా వీడియోలు

Back to Top