ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషనరుకు ఫిర్యాదు

హైదరాబాద్, 19 జూన్ 2013:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలపై అవకతవకలకు పాల్పడుతన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేటరీ పార్టీ ఆరోపించింది. బుధవారం మధ్యాహ్నం ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. ఆయనతో సమావేశమైన వారిలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌రెడ్డి  ఉన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా సాగేలా చూడాలని వారు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

Back to Top