‘వైయ‌స్ఆర్‌ చేయూత’పై హ‌ర్షాతిరేకాలు- వైయ‌స్ జ‌గ‌న్ హామీతో అక్కచెల్లెమ్మ ఆనందం
- జ‌న‌నేత సీఎం కావాలంటూ నిన‌దిస్తున్నఏపీ ప్ర‌జ‌లు
విశాఖ‌:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌పై రాష్ట్ర ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మళ్లకు ‘వైయ‌స్ఆర్‌ చేయూత’ పథకం కింద రూ.75,000 ఉచితంగా ఇస్తామని వైయ‌స్ జగన్‌ ప్రకటించ‌డం ప‌ట్ల హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఈ మొత్తాన్ని నాలుగు దఫాల్లో ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకంగా అందచేస్తామని నిన్న కే. కోట‌పాడు బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. అధ్వాన స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తామని జ‌న‌నేత‌ హామీ ఇచ్చారు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పునంతా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామని ప్రకటించ‌డంతో పొదుపు సంఘాల స‌భ్యులు సంబ‌ర‌ప‌డుతున్నారు.  మళ్లీ సున్నా వడ్డీ విప్లవాన్ని తీసుకొచ్చి అక్కచెల్లెమ్మళ్లు వారి కాళ్లపైనే నిలబడేలా చేస్తామన్న వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసాతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.  ప్రతి ఊరిలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించి అక్కడే పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లు, మరుగుదొడ్లు, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ పథకాలన్నీ మంజూరు చేస్తామని వైయ‌స్ జ‌గ‌న్ పునరుద్ఘాటించ‌డంతో మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు.   

  ‘రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామో చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించామ‌ని. ప్రతి రైతన్న, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించామ‌ని చెప్ప‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఒక స్వప్నాన్ని చూశారు. బ్యాంకుల్లో పావలా వడ్డీ, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పించారు. కానీ చంద్రబాబు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు రావాలంటే బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు చెల్లించకుండా అన్యాయం చేశాడు. బాబు పుణ్యమా అని బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. వేలం నోటీసులు వస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి.

బాబు మోసంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,206 కోట్ల నుంచి వడ్డీలతో కలుపుకొని రూ. 21,600 కోట్లకు చేరాయి. 2016 సెప్టెంబర్‌ నుంచి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వడ్డీ డబ్బులు కట్టడం మానేసింది. దీంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందుకే వారికి నేను హామీ ఇస్తున్నా.. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత... ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాలలో ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తానని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు హామీ ఇస్తున్నా. మళ్లీ సున్నా వడ్డీ విప్లవాన్ని తీసుకువస్తా. వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తా. నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్కా, చెల్లెమ్మ లక్షాధికారి కావలన్నది. సున్నా, పావలా వడ్డీ రుణాలు తిరిగి వచ్చేలా బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులను కట్టేసి రుణాలు ఇప్పిస్తాం.  అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పే వారిలో నేను మొదటి వ్యక్తినని గర్వంగా కూడా చెబుతా అని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. 


కొత్త పధకానికి జ‌న‌నేత నాంది
నవరత్నాల ద్వారా ప్రతి అక్కచెల్లెమ్మ కోసం వైయ‌స్ఆర్  చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలు జ్వరాన పడి ఒక్కరోజు పనికి వెళ్లకపోతే ఇంట్లో పస్తులు ఉండే పరిస్థితి. ఆ అక్కల కోసం చెబుతున్నా. ఆ అక్కలకు తోడుగా ఉండాలంటే 45 ఏళ్లకే పెన్షన్‌ ఇవ్వాలని నేను ఆ రోజుల్లో చెబితే 45 ఏళ్లకే పెన్షన్‌ ఏమిటని వెటకారం చేశారు. ఆ సందర్భంగా వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ‘వైయ‌స్ఆర్‌ చేయూత’ అని కొత్త పధకానికి నాంది పలుకుతున్నా. ఈ పథకాన్ని వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా  అమలు చేస్తామని చెబుతున్నా. ఈ రోజు మనమంతా వివిధ కులాలకు కార్పొరేషన్లు కావాలని అడుగుతున్నాం. వాటిని ఎందుకడుగుతామో తెలుసా? కారణం ఏమిటంటే ఆ కార్పొరేషన్ల ద్వారా మనకేమైనా డబ్బులు వస్తాయోమో, వాటి ద్వారా మనకు ఏమైనా మంచి జరుగుతుందేమో అని ఆశ. కానీ ఇవాళ వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందో పరిశీలన చేయమని అడుగుతున్నా.ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటే లంచాలు తీసుకుని నచ్చిన వారికి నచ్చినంత మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఊళ్లో వెయ్యి మంది ఉంటే కనీసం ఐదుగురికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. లంచాలు ఇస్తే, వారికి నచ్చితే మాత్రమే ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా ఏమిటో తెలుసా? 20 శాతం లబ్ధిదారుడు కట్టాలట, 30 శాతం సబ్సిడీ అట, 50 శాతం లోనట. వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆ 50 శాతం లోను ఎప్పుడూ రాదు. ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ఆ 30 శాతం కోసం లంచాలు ఇవ్వాల్సిందే. అప్పుడే అది వస్తుంటుంది. అదీ ఎంతమంది కంటే ఊరిలో ఓ వెయ్యి మంది ఉంటే ఐదుగురికి కూడా ఇవ్వని పరిస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంతటి అధ్వాన్న స్థితిలో ఉన్న ఈ కార్పొరేషన్‌ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇచ్చారు.  ఈ కార్పొరేషన్లలో పారదర్శకంగా ప్రమాణాలు తెచ్చి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన ప్రతి అక్కలకు, కుటుంబానికీ రూ.75 వేలు ఉచితంగా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకూ, ప్రతి కుటుంబానికి అందేలా చేస్తానని మాట ఇచ్చారు. జ‌న‌నేత హామీపై రాష్ట్ర‌వ్యాప్తంగా అక్క‌చెల్లెమ్మ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Back to Top