వైయ‌స్ఆర్‌ చారిటబుల్‌ ట్ర‌స్టు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

గుత్తి: వైయ‌స్ఆర్ చారిట‌బుల్‌ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో పట్టణంలోని సబ్ జైల్ వద్ద చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్ర‌స్టు వ్యవస్థాపకులు పేరుమళ్ల జీవానందరెడ్డి చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేసి మినరల్‌వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చ‌లివేంద్ర ప్రారంభం అనంత‌రం అక్క‌డే దివంగ‌త మ‌హానేత ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్‌క‌ట్ చేసి స‌బ్‌జైల్‌లోని ఖైదీల‌కు పంపిణీ చేశారు. పేరుమాళ్ల జీవానందరెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యం లాంటిదన్నారు. ఇప్పటికే వైయ‌స్ఆర్ ట్ర‌స్టు ఆధ్వర్యంలో గుంతకల్లు నియోజకవర్గంతో పాటు జిల్లాలో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అనేక చోట్ల ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ట్ర‌స్టు సభ్యులు జగ్గాల రవి, చంద్రశేఖర్, నక్కా నారాయణరెడ్డి, పట్ర పుల్లయ్య, ప్రసాద్‌గౌడ్, నారాయణస్వామి, శర్మాస్‌( మాస్‌), మాబు పీరా, జహీర్, నరసింహా తదితరులు పాల్గొన్నారు.
Back to Top