కారణజన్ముడు వైయస్‌ఆర్‌

కోట్ల మంది హృదయాల్లో ఇంకా బతికేఉన్నారు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ

ఇడుపులపాయ: నేటితరం రాజకీయ నాయకులకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రోల్‌మోడల్‌ అని ఆయన సతీమణి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు. వైయస్‌ఆర్‌ కారణజన్ముడని కొనియాడారు. వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. దేవుడిచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుడి దగ్గరకు వెళ్లారన్నారు. అయినా కొన్ని కోట్ల మంది హృదయాల్లో వైయస్‌ఆర్‌ ఇంకా బతికే ఉన్నారన్నారు. ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం చేయగలరో అన్నీ చేశారన్నారు. రాజకీయాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. వైయస్‌ జగన్‌ కూడా ప్రజలకు మంచి చేయాలని పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ విజయమ్మ అన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం, వైయస్‌ఆర్‌ పథకాలు ప్రజలకు సంపూర్ణంగా అందించాలని వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా రాజన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. మంచి భర్తగా, ప్రజల నాయకుడిగా, రాజుగా నిలబెట్టిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top