మేరీల్యాండ్ లో మహానేత జయంతి వేడుకలు

అమెరికా: మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని ఏలికట్ సిటీ  పాటపాస్కో వ్యాలీ స్టేట్ పార్క్లో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తెలుగు ఎన్నారై కుటుంబాలు ఒకచోట చేరి వైయస్సార్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మళ్లీ రాజన్నరాజ్యం రావాలని, వైయస్ జగన్ వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.   మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసిన టీడీపీని రానున్న ఎన్నికల్లో ప్రజలే సాగనంపుతారన్నారు.
వైయస్.రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ‘వ్యవసాయం దండగ కాదు పండగ’ అని రుజువు చేసిన ఘనత వైయస్సార్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Back to Top