మహానేత స్మృతిలో

ఎ.కొండూరు: మండలంలోని చీమలపాడు, కృష్ణారావుపాలెం, ఎ.కొండూరు, రేపూడి, రేపూడి తండా, కంభంపాడు, అట్లప్రగడ, కోడూరు, పోలిశెట్టిపాడు, వల్లంపట్ల, గొల్లమందల పలు గ్రామాల్లో శనివారం వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వైయస్‌ విగ్రహాల వద్ద చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి పాల్గొని మాట్లాడుతూ మహానేత వైయస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నిరుపేదలు నేటికీ ఆయనను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారన్నారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పాలం ఆంజనేయులు, మండల అధ్యక్షుడు భూక్య గనియా, మండల యూత్‌ అధ్యక్షుడు కలసాని చెన్నారావు, ఎంపీటీసీ సభ్యులులు పర్వతనేని చంద్రమోహనరావు, ఎం. యోసోబు, మండల కార్యదర్శి అత్తనూరు వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
.............................................
నకరికల్లు: పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి లేనిలోటు తీరనిదని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి చెప్పారు. దేచవరం, రూపెనగుంట్ల, చీమలమర్రి, నకరికల్లు, చేజర్ల, గుండ్లపల్లి, నర్శింగపాడు, త్రిపురాపురం, కుంకలగుంట, చల్లగుండ్ల, చాగల్లు తదితర గ్రామాల్లో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని శనివారం నిర్వహించారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నదానం చేపట్టారు. ఎన్నారై భువనం సుభాస్‌చంద్రబోస్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు దొండేటి కోటిరెడ్డి, కొత్తమాసు ఆంజనేయులు, బీసీసెల్‌ కన్వీనర్‌ కోనంకి ఆదినారాయణ, బ్రహ్మానందం, గోగా యలమంద, బద్దుల హరిబాబు, మేడికొండ రామిరెడ్డి, వడ్రా చిన్న, అరవా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
...........................................................

వాడవాడలా రాజన్న స్మరణ
గ్రామ గ్రామాన వైయస్సార్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు
భారీగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
వినుకొండ : పేదల గుండె చప్పుడైన మహానేత రాజన్న 8వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.

తాజా ఫోటోలు

Back to Top