7,8 తేదీల్లో ‘తూర్పు’లో వైయ‌స్‌ జగన్ పర్యటన

కాకినాడ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 7,8 తేదీల్లో ప‌ర్య‌టిస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైయ‌స్ జగన్ పర్యటిస్తారని ఆయ‌న పేర్కొన్నారు. 7 వ తేదీ రంపచోడవరం, మారేడుమిల్లిలో పర్యటన కొనసాగనుంది. 8 వ తేదీ విలీన మండలాల్లో పర్యటించి పోలవరం నిర్వాసితులతో వైయ‌స్ జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కాళ్లవాపు బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు కన్నబాబు వెల్లడించారు.

Back to Top