వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21న వైయస్‌ జగన్‌ 44వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు పేద మహిళలకు చీరల పంపిణీ, యువకుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎంపీ చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్‌ జగన్‌ అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు చక్రాల కుర్చీలు, వృద్ధులకు చేతికరల్రు అందించనున్నారు. ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
Back to Top