అనంతపురం చేరుకున్న వైఎస్ జగన్

అనంతపురం : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర అనంతపురం చేరింది.  ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర జన ఉప్పెనలా సాగుతోంది. ఐదో రోజు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కదిరి ఆర్అండ్‌బీ అతిధి గృహం నుంచి అల్లిపూర్ తండా, ముత్యాల చెరువు, పులగం పల్లి, మిట్టపల్లి, ఇనగలూరు క్రాస్, గాజుకుంటపల్లి, ఓబులదేవర చెరువు మీదుగా వడ్డివారి పల్లి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం చేరుకొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్నాలో పాల్గొంన్నారు.

Back to Top