నేడు విజ‌య‌న‌గ‌రంలో యువ‌భేరి

* స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతున్న వైయ‌స్ జ‌గ‌న్‌
* విద్యార్థుల‌కు ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌త‌కను వివ‌రించ‌నున్న జ‌న‌నేత‌
హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌నం ప్ర‌త్యేక హోదా ఎందుకు అడుగుతున్నాం?  హోదా వ‌ల్ల క‌లిగే లాభాలు ఏంటి?  హోదా రాక‌పోతే జ‌రిగే న‌ష్టం ఏంటి? అనే విష‌యాల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు జ‌రిగే యువ‌భేరిలో విద్యార్థుల‌కు వివ‌రించ‌నున్నారు. విజ‌య‌న‌గ‌రంలోని  జ‌గ‌న్నాథ ఫంక్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించే ఈ యువ‌భేరి కార్య‌క్ర‌మానికి విద్యార్థులు, నిరుద్యోగులు  ప్రొఫెస‌ర్లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగే విద్యార్థుల‌తో ముఖాముఖిలో  వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ స‌మాధానాలిస్తారు. అనంత‌రం జిల్లాలోని బలిజిపేట మండలంలో చిలకలపల్లి, సభద్ర గ్రామాలకు వెళ్లి ఇటీవల హైదరాబాద్‌లో భవన నిర్మాణం సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 

తాజా ఫోటోలు

Back to Top