ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి

 హైదరాబాద్:  
మహిళా తహశీల్దార్‌పై దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్
ను అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా అధికారిపై
దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఒక మహిళా అధికారిని అధికార తెలుగుదేశం పార్టీ
విప్ దూషిస్తూ అవమానపరిచి, దౌర్జన్యానికి పాల్పడిన ఈ ఘటన.. ఇసుక మాఫియాతో సిగ్గు మాలిన
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న అపవిత్ర బంధమేంటో తేటతెల్లం చేస్తోంది. ఈ చర్యను
అందరూ ఖండించాలి.  ఆ ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్
చేయాలి’’  అని జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ కు విశేష స్పందన కనిపించింది.

Back to Top