జ‌నంతో జ‌గ‌న్‌..!

అనంత‌పురం) పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌నిషి.  ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నంతో మ‌మేకం అవుతారు. ఇప్పుడు అనంత‌పురం జిల్లా లోని రైతు భ‌రోసా యాత్ర‌లో ఇదే క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న ప్ర‌భంజ‌నం అగుపిస్తోంది.
మూడో విడ‌త రైతు భ‌రోసా యాత్రంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ బుధ‌వారం నాడు క‌ళ్యాణ దుర్గం నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట‌గా క‌ళ్యాణ దుర్గంలో నిర్మించ త‌ల‌పెట్టిన పార్టీ కార్యాల‌య భ‌వ‌నానికి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. త‌ర్వాత బ్ర‌హ్మ స‌ముద్రం మండ‌లం పొబ్బ‌ర‌ప‌ల్లి గ్రామంలోఆత్మ హ‌త్య చేసుకొన్న రైతు ఈర‌న్న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. అనంత‌రం ముదిగ‌ల్లు లో బోయ నారాయ‌ణ‌ప్ప కుటుంబానిది, ప‌ర్ణిలో గంగ‌ప్ప కుటుంబానిది ఇదే ప‌రిస్థితి. 
వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌న ప్ర‌భంజ‌నం స్ఫ‌ష్టంగా క‌నిపించింది. వెఎస్ జ‌గ‌న్ ను క‌లిసేందుకు, యాత్ర‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి వచ్చారు. యాత్ర పొడ‌వునా అశేష సంఖ్య‌లో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top