బందర్‌ పోర్ట్‌ బాధితుల పోరాటానికి వైయస్‌ జగన్‌ మద్దతు

డిసెంబర్‌ 1న పోర్ట్‌ గ్రామాల్లో ప్రతిపక్ష నేత పర్యటన
మచిలిపట్నం: కృష్ణా జిల్లా పరిధిలో బందర్‌ పోర్ట్‌ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూసమీకరణ చర్యలు చేపట్టడంతో బాధితులు ఉద్యమిస్తున్నారు. వీరి పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు బాధిత గ్రామాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. డిసెంబర్‌ 1న పోర్ట్‌ పరిసర గ్రామాలకు ప్రతిపక్ష నేత వెళ్లి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. బందర్‌ పోర్ట్‌ కోసం ప్రభుత్వం 30 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్నారు. ఈ చర్యలతో పేద రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో వీరి ఆందోళనకు ప్రతిపక్ష నేత అండగా నిలిచేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.
Back to Top