కాంట్రాక్ట్‌ లెక్చరర్ల దీక్షకు వైయస్‌ జగన్‌ మద్దతు

విజయనగరం: డిమాండ్ల సాధన కోసం విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన కాంట్రాక్ట్‌ లెక్చరర్ల దీక్షకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మద్దతు తెలిపారు. జిల్లాలో తలపెట్టిన యువభేరి కార్యక్రమానికి హాజరైన వైయస్‌ జగన్‌ సోమవారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు.  కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలను వైయస్‌ జగన్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ను రెగ్యులర్‌ చేస్తానని, ఈ ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Back to Top