ప్ర‌త్యేక హోదా కోసం తీవ్ర పోరు


హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటాన్ని ఉధృతం చేస్తామ‌ని వైఎస్సార్‌సీపీ ప్ర‌క‌టించింది. హైదరాబాద్ లోని లోట‌స్ పాండ్ లోని పార్టీ కార్యాల‌యంలో మాజీమంత్రి, సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కు..ప్ర‌త్యేక హోదా అన్న నినాదంతో పోరాటం సాగిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఈ నెల 10న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నా జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల్లో క్రియా శీల‌కంగా ప‌నిచేసే నాయ‌కులు పాల్గొంటార‌ని చెప్పారు. ఇందుకోసం ఏడో తేదీ అర్థ రాత్రి తిరుప‌తి, అన‌కాప‌ల్లి నుంచి రెండు ప్ర‌త్యేక రైళ్లు బ‌య‌లు దేర‌తాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌లా ఒక ర‌కంగా ప్ర‌త్యేక హోదా మీద మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఒక వైపు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఇటువంటి స‌మాధానం వ‌స్తున్న‌ప్ప‌టికీ క‌ల్ల బొల్లి మాట‌ల‌తో కాలక్షేపం చేస్తున్నార‌ని బొత్స వివ‌రించారు. 
Back to Top