9 నుంచి నంద్యాలలో వైయ‌స్‌ జగన్‌ పర్యటన

నంద్యాల‌:  వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 9వతేదీ నుంచి నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు పార్టీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించారు. బుధ‌వారం మధ్యాహ్నం 1 గంటకు రైతునగరం నుంచి ఉప ఎన్నికలో పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రచారం ప్రారంభిస్తారని  గౌరువెంకటరెడ్డి  తెలిపారు. రైతునగరం నుంచి రోడ్డు మార్గం గుండా గోస్పాడు మండలంలోని ఎస్‌.కల్లూరు వరకు మొదటిరోజు రోడ్‌షో కొనసాగుతుందని ఆయన తెలిపారు. రెండో రోజు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె నుంచి ఉపఎన్నికల ప్రచారం ప్రారంభమై నంద్యాల మండలంలోని కొత్తపల్లి వద్ద ముగుస్తుందని ప్రకటించారు. మూడో రోజు శుక్రవారం చాపిరేవుల వద్ద రోడ్‌షో ద్వారా ప్రారంభమైన ప్రచారం నంద్యాల పట్టణం వైయ‌స్ఆ ర్ నగర్‌ వరకు కొనసాగుతుందని గౌరు వెంకటరెడ్డి వివరించారు.

Back to Top