మక్కా దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..!

రియాద్ః మక్కామసీదు దుర్ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ముస్లింలకు పవిత్రస్థలమైన సౌదీలోని మక్కామసీదులో  విస్తరణ పనులు సాగుతుండగా...భారీ క్రేన్ పై భాగం  కుప్పకూలింది. ఈఘటనలో 87 మంది మృతిచెందారు.184 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు భారతీయులు మరణించగా.. మరో 15 మందివరకు గాయపడినట్లు సమాచారం. 

పవిత్రహజ్ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందే  ఈదుర్ఘటన చోటుచేసుకోవడం తీవ్రవిషాదాన్ని నింపింది. 
Back to Top